ఇక నుంచి ఆర్టీసీ పెట్రోల్‌ బంకులు

ప్రారంభించిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ తాజాగా పెట్రో రిటైల్‌ బిజినెస్‌లోకి దిగింది. జనగామలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌ గురువారం హైదరాబాద్‌ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. సంస్థ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి చెప్పారు. హన్మకొండ, మహబూబాబాద్‌, బిచ్కుంద, బీర్కూర్‌, ఆసిఫాబాద్‌లలో ఈ నెల 15న బంక్‌లు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు సంస్థ హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం చేసుకుందని చెప్పారు. పెట్రోల్‌ బంక్‌లతో నెలకు రూ.20.65 లక్షల అదనపు ఆదాయం పొందాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.

For More News..

రైతు బీమాకు రూ.1,141 కోట్లు రిలీజ్

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం

ప్రైవేటు స్కూల్స్ ఫీజులు దోచుకుంటుంటే సర్కార్‌ ఏం చేస్తోంది?