ఉద్యోగులు టీషర్టులు,జీన్స్ తో ఆఫీసుకు రావొద్దు: టీఎస్ఆర్టీసీ

ఉద్యోగులు టీషర్టులు,జీన్స్ తో ఆఫీసుకు రావొద్దు: టీఎస్ఆర్టీసీ

డ్రెస్ కోడ్ అనేది ప్రభుత్వ సంస్థల్లో కామన్..ఒక్కోసంస్థకు ఒక్కో యూనిఫామ్ ఉంటుంది. టీఎస్ ఆర్టీసి సిబ్బందికి కూడా ఓ ప్రత్యేక యూనిఫామ్ ఉంటుంది మనకు తెలుసు..ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఖాకీ, నీలిరంగు యూనిఫామ్ ఉంటుంది.. బస్ స్టేషన్లలో పనిచేసే సూపర్ వైజర్లకు తెల్లటి యూనిఫామ్ ధరిస్తారు.. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కార్యాలయాల్లో ఉద్యోగులకు ఎటువంటి నిర్ధిష్టమైన డ్రెస్ కోడ్ లేదు.. తాజాగా టీఎస్ ఆర్టీసీ వారికి కూడా డ్రెస్ కోడ్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఉద్యోగులు ఇకపై టీషర్టులు, జీన్స్ ధరించి ఆఫీసులకు రావొద్దని కోరింది. 

అధికారిక ఉత్తర్వులు లేనప్పటికీ TSRTC MD వీసి సజ్జనార్.. కార్యాలయ ఉద్యోగులందరూ అధికారిక డ్రెస్ కోడ్ కు కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడా ది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎంకేసీఆర్ టీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2023 ఆగస్లు 6న తెలంగాణ రాష్ట్ర శాసన సభ విలీన బిల్లును ఆమోదించింది. ప్రజా రవాణా సంస్థలోని 46 వేల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా పరిగణించారు. 

అయితే డ్రైవర్లు, బస్ కండక్టర్లు వారి యూనిఫామ్ ధరిస్తున్నారు. కానీ టీఎస్ ఆర్టీసీ ఆఫీసుల్లో అనధికార దుస్తులు ధరించి పనిచేసే అధికారులు సంస్థ గౌరవానికి భం గం కలిగిస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.