తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీఎస్ ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇకపై టీఎస్ కు బదులు టీజీ కనిపించనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, వాహనాల రిజస్ట్రేషన్లు అన్నీ టీజీ తో ఉండనున్నాయి.
ఇటీవలే లోగోను మారుస్తున్నట్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ అధికారులు.. ఇవాళ టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. అధికారిక ట్విట్లర్ అకౌంట్లు కూడా tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది.
ఇకపై ఎవరైనా సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు సజ్జనార్. TGSRTC అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice , @tgsrtchq అకౌంట్లను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో బస్సులు కూడా టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్ కానున్నాయి.
ముఖ్య గమనిక: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఆ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని… pic.twitter.com/vwwnklHttw
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 22, 2024