హైదరాబాద్లో సెప్టెంబర్ 28వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం కన్నుల పండువగా జరగనుంది. నవ రాత్రుల పాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న వినాయక విగ్రహాలను భక్తులు..ఆట పాటలతో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జన వేడుకలను చూసేందుకు హైదరాబాద్ తో పాటు..వివిధ జిల్లాల నుంచి తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నపడనున్నట్లు TSRTC ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను నడపనున్నట్లు తెలిపింది. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించగలరు.
Aslo Read :- రెండు రోజులు వైన్స్, బార్లు బంద్
ఏ డిపోలో ఎన్ని బస్సులు..ఏ రూట్లలో..
- కాచిగూడ డిపోకు చెందిన 20 ప్రత్యేక బస్సులు కాచిగూడ నుంచి.. బషీర్ బాగ్ వరకు
- ముషీరాబాద్ డిపోకు చెందిన 20 బస్సులు రామ్ నగర్ నుంచి బషీర్ బాగ్ వరకు
- దిల్ సుఖ్ నగర్ కు చెందిన 15 బస్సులు దిల్ సుఖ్ నగర్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు
- హయత్ నగర్ 1 డిపోకు చెందిన 20 బస్సులు ఎల్బీనగర్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు
- హయత్ నగర్ 2 డిపోకు చెందిన 15 బస్సులు వనస్థలీపురం నుంచి ఓల్డ్ ఎమ్మె్ల్యే క్వార్టర్ వరకు
- మిధాని డిపోకు చెందని 15 బస్సులు మిధాని నుంచి ఓఒల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వరకు
- ఉప్పల్ డిపోకు చెందిన 20 బస్సులు ఉప్పల్ నుంచి లిబర్టీ దగ్గర గల టిటిడి కళ్యాణ మండపం వరకు
- సీజీసీఎల్ డిపోకు చెందిన 10 బస్సులు, ఉప్పల్ డిపోకు చెందిన మరో 10 బస్సులు ఉప్పల్ నుంచి ఇందిరాపార్కు వరకు
- రాణిగంజ్ డిపోకు చెందిన మొత్తం 55 బస్సులులో 35 బస్సులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇందిరా పార్కు వరకు, మరో 20 బస్సులు మల్కాజ్ గిరి నుంచి ఇందిరాబాద్ పార్కు వరకు
- ముషీరాబాద్ డిపోకు చెందిన మరో 20 బస్సులు జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్కు వరకు
- మెహదీపట్నం డిపోకు చెందిన 20 బస్సులు టోలిచౌకి నుంచి లకిడికపూల్ వరకు
- బర్కత్ పురా డిపోకు చెందిన 20 బస్సులు బెల్ నుంచి ఖైరతాబాద్ వరకు
- HCU డిపోకు చెందిన 20 బస్సులు కొండాపూర్ నుంచి ఖైరతాబాద్ వరకు
- రాజేంద్రనగర్ డిపోకు చెందిన 20 బస్సులు రాజేంద్రనగర్ నుంచి లకిడికపూల్ వరకు
- ఫలక్ నుమా డిపోకు చెందిన 20 బస్సులు కోటి నుంచి అసెంబ్లీ దగ్గర గల ఆల్ ఇండియా రెడియో వరకు
- జీడిమెట్ల డిపోకు చెందిన మొత్తం 35 బస్సులు జీడిమెట్ల, జగద్గిరిగుట్ట నుంచి ఖైరతాబాద్ వరకు
- కూకట్ పల్లి డిపోకు చెందిన 50 బస్సులు సనత్ నగర్, కూకట్ పల్లి, బోరబండ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ వరకు
- మియాపూర్ 2 డిపోకు చెందిన 15 బస్సులు, HCUకు చెందిన 15 బస్సులు కూకట్ పల్లి, పటాన్ చెరు నుంచి ఖైరతాబాద్ వరకు