ఆర్టీసీలో ఫ్యామిలీ 24 టికెట్లు రద్దు

ఆర్టీసీలో  ఫ్యామిలీ 24 టికెట్లు రద్దు

హైదరాబాద్, వెలుగు: ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లు తీసుకొచ్చింది. మహాలక్ష్మి స్కీమ్ కారణంగా బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్​లో వెల్ల డించారు. ‘‘ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయస్సు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీకి కండక్టర్లకు చాలా టైమ్ పడు తు న్నది. దీంతో ట్రావెల్ టైమ్ కూడా పెరుగు తున్నది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉప సంహరించుకుంటున్నాం. జనవరి 1 నుంచి జారీ ఉండదు’’అని సజ్జనార్ తెలిపారు.