ఓటమితో ఆటకు వీడ్కోలు పలికిన టీటీ లెజెండ్‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌ కమల్‌

ఓటమితో ఆటకు వీడ్కోలు పలికిన టీటీ లెజెండ్‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌ కమల్‌

చెన్నై: ఇండియా టీటీ లెజెండ్‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ ఓటమితో కెరీర్‌‌‌‌కు వీడ్కోలు పలికాడు. డబ్ల్యూటీటీ స్టార్‌‌‌‌ కంటెండర్‌‌‌‌ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన తొలి రౌండ్‌‌‌‌లో శరత్‌‌‌‌ 9–11, 8–11, 9–11తో స్నేహిత్‌‌‌‌ సురవజ్జులు చేతిలో ఓడాడు. స్టార్టింగ్‌‌‌‌లో మెరుగ్గా ఆడిన శరత్ ఆ తర్వాత వెనకబడ్డాడు. ఈ మ్యాచ్‌‌‌‌ తర్వాత ఈజిప్ట్‌‌‌‌కు చెందిన ఒమర్‌‌‌‌ అస్సార్‌‌‌‌తో ఎగ్జిబిషన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడి కెరీర్‌‌‌‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. 

మ్యాచ్‌‌‌‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశాడు. కెరీర్‌‌‌‌ నుంచి తప్పుకున్నా ఏదో రకంగా టీటీకి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చాడు.  క్వార్టర్స్‌‌‌‌లో మానవ్‌‌‌‌ ఠక్కర్‌‌‌‌ 5–-11, 12–-10, 3–-11, 11–-6, 11–-1తో లిమ్‌‌‌‌ జాంగ్‌‌‌‌ హున్‌‌‌‌ (కొరియా)పై నెగ్గి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఫీట్‌‌‌‌ సాధించిన తొలి ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు.