Good News: తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి

Good News:  తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి
  • వారానికి 2 రోజులు సిఫార్సు లేఖలకు చాన్స్
  • కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థాన బోర్డు

హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు శుభవార్త చెప్పింది. వారానికి రెండు రోజుల పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల లేఖలను అనుమతించనున్నట్టు పేర్కొంది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు లేఖలు అందించినా అవి బుట్టదాఖలయ్యేవి. తమ లేఖలను కూడా అనుమతించాలని ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.

ALSO READ | ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా

తెలంగాణలోని దేవాలయాలకు వస్తే తాము అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అలాగే తిరుమలలోనూ వర్తింపజేయాలని కోరారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న ఏపీ మంత్రులు, నాయకులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ప్రత్యేక దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించింది.