నీటి ఆంక్షలపై వెనక్కి తగ్గిన టీటీడీ... ప్రత్యామ్నాయాలపై కసరత్తు

తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో నీటి సరఫరాపై ఆంక్షలు అన్న వార్త వెలువడగానే అటు భక్తులు, ఇటు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో నీటి ఆంక్షలపై టీటీడీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

నీటి సరఫరా కోసం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ అధికార్లతో టీటీడీ ఈవో సమావేశమయ్యి, తిరుమలకు కావాల్సిన  నీటి కేటాయింపులు పెంచేందుకు చర్చకు జరపనున్నట్లు సమాచారం.