శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల పునరుద్ధరించినట్టు వెల్లడించారు అధికారులు. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ జరిపారు. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో తప్పనిసరిగా టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. లేకుంటే దర్శనాలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది.
భక్తుల అవసరాన్ని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని టీటీడీ ఈఓ శ్యామల రావు గుర్తించారు. దీంతో పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రైల్ రన్ చేస్తామని వెల్లడించారు. త్వరలో 6వేల టోకెన్లకు పెంచనున్నట్టు తెలుస్తుంది. తాజా నిర్ణయంతో టీటీడీ దళారులకు చెక్ పెట్టినట్టే అయ్యింది.