తిరుపతికి సిఫారుసు లేఖలు పంపొద్దు

వచ్చే పది రోజుల పాటు తిరుపతికి సిఫారుసు లేఖలు పంపొద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 12 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ దర్శనానికి వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని ఆయన కోరారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీకి సహకరించాలని వైవీ కోరారు. ఈ 10 రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు.

కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున  ప్రజా ప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆథితి గృహాల్లోవసతి కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక వేళ తిరుమలలో వసతి సరిపోక పోతే  తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.

For More News..

కరోనా నేపథ్యంలో సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయం

ప్రిన్సిపాల్‌ సహా విద్యార్థులకు కరోనా