కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి అన్నప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. శ్రీవారి భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా అన్నప్రసాదం మెనూలో మార్పులు చేయాలని నిర్ణయించింది టీటీడీ. అన్నప్రసాదంలో ప్రస్తుతం అందిస్తున్న భోజనంతో పాటు మసాలా వడ అందించనుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది.. ఈ మేరకు సోమవారం ( జనవరి 20, 2025 ) అన్నప్రసాద కేంద్రంలో ట్రయిల్ రన్ నిర్వహించారు టీటీడీ అధికారులు.
ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించినట్లు తెలిపారు టీటీడీ అధికారులు. మసాలా వడలు రుచికరంగా వున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు అధికారులు. ఫిబ్రవరి 04వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ మసాలా వడలు వడ్డించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు టీటీడీ అధికారులు.