శ్రీవారి భక్తులకు శుభవార్త : వైకుంఠ ఏకాదశి టికెట్లపై సంచలన నిర్ణయం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..  తిరుమల శ్రీవారి భక్తుల ఎంతగానో ఎదురు చూసే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. టికెట్ల విడుదలపై ఈవో ధర్మారెడ్డి స్పష్టత ఇచ్చారు.. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు (10 రోజులు) వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. దీనికి సంబంధించిన టికెట్ల విడుదల, ఎన్ని టికెట్ల జారీ చేస్తారో తెలిపారు. 

 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 ల‌క్షల రూ.300/- దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్లు తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా రోజుకు 50 వేల చొప్పున మొత్తం 5 లక్షల టైంస్లాట్‌ టోకెన్లను విడుదల చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ కోటా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం  ( నవంబర్ 3) డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. 

సర్వదర్శనం టోకెన్లను  తిరుప‌తిలో 9 కేంద్రాల‌లో 100 కౌంట‌ర్లలో డిసెంబ‌రు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు  టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు  4 లక్షల 25 వేల టోకెన్లను సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల్లో సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, ఇతర ప్రివిలైజ్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.    డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేసినట్లు  ఈవో ధర్మారెడ్డి తెలిపారు,.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుండి 2024 జ‌న‌వ‌రి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. -    భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలన్నారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.

ALSO READ :- కమ్యూనిటీ గ్రూప్ చాట్స్ పై.. వాట్సాప్ లో కొత్త ఫీచర్