ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ క్రమంలో టీటీడీ ఈఓ శ్యామల రావు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వాడే నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసారు.
Also Read :- త్వరలోనే జనసేనలో చేరుతున్నా.. బాలినేని
నెయ్యి శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపగా..వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని తేలిందని అన్నారు. శాంపిల్స్ తీసుకున్న రెండు ట్యాంకర్లను వెనక్కు పంపా మని అన్నారు. కల్తీ నెయ్యి పంపిన సప్లయర్ కాంట్రాక్ట్ రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టామని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ల్యా బ్ రిపోర్ట్ వార్తల్లో వాస్తవం లేదని తేలింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నవారిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.