
టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు.గత ప్రభుత్వంలోవిజిలెన్స్ అధికారులను అనుమతించలేదన్న ఆయన ..మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టీటీడీ గోశాలలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. .అప్పట్లో అధికారుల నిర్లక్ష్యంతో రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయనీ.. దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇపుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు.
గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయన్నారు. టిటిడి గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టిటిడిని , ఇపుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు.