తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 2024, సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఆయన తిరుమల వచ్చారు.
వేంకటేశ్వరస్వామి పుష్కరణిలో స్నానం చేసిన ఆయన.. స్వామి ఆలయం ఎదుట టెంకాయ కొట్టారు. ఆ తర్వాత స్వామివారి అఖిలాండం దగ్గర కర్పూర దీపం వెలిగించారు. హారతి పట్టుకుని ప్రమాణం చేశారు.
ALSO READ | Jagan: తిరుమల లడ్డూపై నిజాలు తెలుసుకోండి.. దేశంలోని బీజేపీ సీఎంలకు జగన్ లేఖలు
లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిపినట్లయితే.. అపచారం చేసి ఉంటే.. భూమన కరుణాకర్ రెడ్డి అనే నేను.. నా కుటుంబం సర్వ నాశనం అవుతుంది అంటూ ప్రమాణం చేశారు. అఖిలాండం దగ్గర.. భూమున కరుణాకర్ రెడ్డి చేసిన ప్రమాణంతో.. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. రాజకీయ మాటలు.. రాజకీయ ప్రమాణాలకు అవకాశం లేదంటూ పోలీసులు వాదించటం విశేషం.
లడ్డూ ప్రసాదం అపవిత్రం అయినట్లు సీఎం చంద్రబాబు ఆరోపించిన తర్వాత రోజే.. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించారు. అప్పట్లోనే ఆయన సవాల్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఆయన.. తడిబట్టలతో తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో.. అఖిలాండం దగ్గర హారతి వెలిగించి ప్రమాణం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుమలలో మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం
— YS Jagan Trends (@YSJaganTrends) September 23, 2024
-> తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీ పై ఆలయం ముందు ప్రమాణం చేసిన కరుణాకర్ రెడ్డి
-> పుష్కరిణి లో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించిన కరుణాకర్ రెడ్డి#YSJagan #TirumalaLaddu #Tirumala pic.twitter.com/9zEZOZThUK