తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరీ ముఖ్యంగా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కే భక్తులకు శుభవార్త చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. అలిపిరి కాలి నడక మార్గంలోని భక్తులకు సైతం.. మార్గ మధ్యలో ఉచిత దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారాయన.
ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలోనే ఈ విధానం అమల్లో ఉంది. శ్రీవారి మెట్లదారిలో.. మార్గమధ్యలో ఉచిత దర్శనం టోకెన్లు అందజేస్తున్నారు. అలిపిరి మార్గంలో ఈ విధానం లేదు. ఇప్పుడు కొత్తగా అలిపిరి మార్గంలోనూ ఉచిత దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారాయన.
Also Read :- బంతి, చామంతి పూలకు మస్త్ గిరాకీ
ఎప్పటి నుంచి అమల్లోకి ఈ విధానం వస్తుందని అనేది ఇంకా తేదీ ప్రకటించలేదు. అతి త్వరలోనే అని వెల్లడించారాయన. ఏదిఏమైనా ఇది మాత్రం తిరుమల కొండకు అలిపిరి నుంచి వెళ్లే భక్తులకు మాత్రం వెరీ వెరీ గుడ్ న్యూస్.. ఎందుకంటే 80 శాతం మంది ఈ మార్గం నుంచే కొండ ఎక్కుతారు.. తమ మొక్కులు చెల్లించుకుంటారు..