తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుపతి తిరుమల లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీధర్, ఇతర టిటిడి అధికారులతొ కలిసి తిరుపతి తిరుమలలో ఏర్పాటు భద్రతా చర్యలను సమీక్షించారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ, ట్రాఫిక్ నిర్వహణ, ఎమర్జెన్సీ సేవలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించారు.
ALSO READ | తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు.. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం..
శ్రీవారి ఆలయం తిరుమలలో 1 కేంద్రం, తిరుపతి నందు 9 టోకెన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, కౌంటర్ల దగ్గర భద్రతను పెంచి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఆలయం బయట హోల్డింగ్ పాయింట్స్, క్యూలైన్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జనవరి 9న ఉదయం 5 గంటల నుండి టోకెన్లు ఇవ్వడం జరుగుతుందనీ. తరువాత రోజుల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
1. టోకెన్ల జారీ కేంద్రాలు
తిరుమలలో1 కేంద్రం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో 9 టోకెన్ జారీ కేంద్రాలను ఏర్పాటు
ప్రతి కేంద్రంలో టోకెన్లు సాఫీగా అందించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు
టోకెన్ల కోసం వేచి ఉండే భక్తులకు నీటి సదుపాయం, ఆశ్రయం, స్వచ్ఛతా కేంద్రాలు ఏర్పాటు చేశారు
2. ట్రాఫిక్ నియంత్రణ
తిరుపతిలో ప్రధాన రహదారులు, భక్తుల ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అంబులెన్సులు, అత్యవసర వాహనాల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు.
3. భక్తుల భద్రత
ప్రధానమైన దర్శన మార్గాలు, టోకెన్ కౌంటర్ల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చారు.
భక్తుల భద్రత కోసం ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నియమించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా సిబ్బంది 24 గంటలుగా విధుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
4. సేవా సదుపాయాలు
పిల్లలు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
5. ఆధ్యాత్మిక అనుభూతి
వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు సజావుగా జరిగేందుకు గట్టి చర్యలు చేపట్టారు.
పోలీసు యంత్రాంగం, టీటీడీ సిబ్బంది మధ్య సమన్వయంతో పనిచేస్తాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రద్దీకి అనుగుణంగా సేవలను విస్తృతంగా అందించాలని అధికారులను ఆదేశించారు.