అంజనాద్రి ఆలయానికి శంకుస్థాపన

అంజనాద్రి ఆలయానికి శంకుస్థాపన

తిరుమలలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అభివృద్ధికి టీటీడీ శ్రీకారం చుట్టింది. కొండపై ఆకాశగంగలో అన్ని ఏర్పాట్లతో భూమి పూజ నిర్వహించారు. హనుమంతుడి జన్మస్థలాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి.. సుందరీకరణ చేపట్టేందుకు శంఖుస్థాప‌న చేశారు. ఆకాశ‌గంగ ప్రాంతంలోని అంజ‌నాదేవి, బాలాంజ‌నేయ‌స్వామి గుడి ఎదురుగా ముఖ మండ‌పం, గోపురాలు, ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు టీటీడీ శ్రీకారం చుట్టింది. 

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య రామ‌జ‌న్మభూమి ఆల‌య నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద‌దేవ్ మహారాజ్‌, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ కప్పగంతుల కోటేశ్వర‌ శ‌ర్మ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

గాడిదపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు

పంజాబ్ వేర్పాటువాదులకు కేజ్రీ మద్దతుదారుడు