- ఫిబ్రవరి 23న ఆన్ లైన్ దర్శన టోకెన్లు విడుదల
- ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వరకు టోకెన్లు విడుదలచేయనున్న టీటీడీ
తిరుమల: శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో దర్శనాల టికెట్లు మరిన్ని విడుదల చేయాలని.. తద్వారా ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ లో సర్వదర్శనం భక్తులకు 20 వేల టోకెన్లు జారీ చేస్తున్న టిటిడి.. రేపు ఉదయం 9 గంటలకు ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు దర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
24వ తేది నుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25 వేలకు పెంచనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ లో.. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు. మార్చి నెలకు సంబంధించి రోజుకు 20వేలు చొప్పున సర్వ దర్శనం టోకెన్లు ఆఫ్ లైన్ లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయిస్తారు.