ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

ఎన్ఆర్ఐ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూ్స్ చెప్పింది.  శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే  ప్రవాస భారతీయులకు వెసులుబాటు కల్పించింది. ఇకపై రోజుకు 100 మంది వీఐపీ దర్శనాలకు అవకాశం కల్పించింది.  ఇప్పటి వరకు రోజుకు 50 మంది  ఎన్ఆర్ఐలకు  మాత్రమే వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఆ సంఖ్యను‌ 100 మందికి  పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

దీంతో ఎన్ఆర్ఐలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈజీగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. టీటీడీ నిర్ణయంతో ఎన్ఐఆర్ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.