తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో  టోకెన్లు

తిరుమలలో  వైకుంఠ ద్వార  దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.  జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి  తిరుపతి నగరంలో 9  ప్రాంతాలలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్లు జారీకి  కేంద్రాలు ఏర్పాటు చేసింది.   క్యూలైన్లలో భక్తులు సహనం పాటించి తోపులాటకు ఆస్కారం లేకుండా టోకెన్లు పొందేవిధంగా చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రతిఒక్క భక్తుడు వైకుంఠ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.  టికెట్లు  కౌంటర్ల దగ్గర  భారీ కేడింగ్ పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు పోలీసులు.

10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనంపై డిసెంబర్ 24న   పోలీస్ అధికారులు. టీటీడీ ఈవో శ్రీ.శ్యామలారావు, అడిషనల్ ఈవో శ్రీ.వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీమతి. గౌతమి,  జిల్లా కలెక్టర్ శ్రీ.వెంకటేశ్వర్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ.శ్రీధర్,  జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు  భద్రతపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన  జిల్లా ఎస్పి శ్రీ ఎల్ సుబ్బరాయుడు  ప్రజల సౌకర్యార్థం నగరంలో 9 ప్రాంతాలలో టోకెన్ జారీ చేయు కేంద్రాలను టీటీడీ వారు ఏర్పాటు చేశారని అక్కడ రద్దీకి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు,  వైకుంఠఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు 10 రోజుల పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు చేసుకొనే విధంగా ఏర్పాట్లను టీటీడి చేసిందని, స్థానిక ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి  అశేష భక్త జనం వచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకాదశి ద్వాదశి రోజులతో పాటు మొత్తం 10 రోజులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం వుంటుంది కావున భారీగా భక్తులు తరలివచ్ఛే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని టోకన్ల జారీ చేయు కేంద్రాలలోని క్యూలైన్లలో తోపులాటలు జరుగకుండా, అలాగే రద్దీని క్రమబద్దికరించడానికి తగినంత పోలీస్ బందోబస్తు  ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఏకాదశి, ద్వాదశి రోజులే కాకుండా జనవరి 10 నుంచి జనవరి 19 వరకు  మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం దర్శనానికి టీటీడి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని.. భద్రతా పరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు,ప్రజలు కూడా ఆత్రుత పడకుండా సహనం వహించి తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తిరుపతి నందు టోకెన్లు పొంది, ప్రశాంతమైన వాతావరణంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని టీటీడీ నియమ నిబంధనలు, సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు.