తెలంగాణలోనూ టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించాలి: ఏపీకి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి

తెలంగాణలోనూ టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించాలి: ఏపీకి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి కొండా సురేఖ కోరారు. తెలంగాణ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారని, ఆదాయం కూడా సమకూరుతున్నందున కల్యాణ మండపాల అభివృద్ధికి టీటీడీ నిధులు అందిచేలా సీఎం చంద్రబాబు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి అమవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశ్వీరచన మండపంలో ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో  శ్రీనివా సరావు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు.