కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. దోషాలు, దుష్ఫలితాలను తొలగించి శ్రీవారి లడ్డూ పవిత్రతను పునరుద్ధరించామని టీటీడీ తెలిపింది. భక్తులు తిరుమల లడ్డూను ఎలాంటి భయం, అనుమానం లేకుండా తినొచ్చన్నారు. లడ్డూ అపవిత్రం కావడంతో తిరుమలలో శాంతియాగం, సంప్రోక్షణ హోమాలు నిర్వహించామని తెలిపారు. తిరుపతి లడ్డూపై ఇప్పుడు ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. నాణ్యమైన నెయ్యితో లడ్డూ తయారీ చేస్తున్నామని తెలిపారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయడు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ | తిరుమల లడ్డూ చుట్టూ లొల్లి.. అయినా తగ్గని డిమాండ్.. 21వ తేదీ ఒక్కరోజే..
లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె, పంది కొవ్వు ఉపయోగించారని ఆరోపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపత్తి లడ్డూ కల్తీ జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యలు దావనంలా వ్యాప్తి చెంది దేశవ్యా్ప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో భక్తులు మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే తిరుమలలో శాంతి యాగాలు, సంప్రోక్షణ హోమాలు చేసి లడ్డూ ప్రవిత్రతను టీటీడీ తిరిగి పునరుద్ధరించింది.
The ritual aimed to remove ill effects and restore the sanctity of Laddu Prasadam and other Naivedyams, as well as to ensure the well-being of Srivari devotees.