
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణ యం తీసుకుంది. వచ్చే నెల ఆగస్టు నుంచి శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణిని మూసివేస్తున్నట్లుగా తెలిపింది. పుష్కరిణిలోని నీటిని తొలిగించిపైపులైను మరమ్మతులు, సివిల్ పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా పుష్కరిణిని మూసివేస్తున్నారు.
దీంతో నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించిస్తున్న నేపథ్యంలో పుష్కరిణిని శుభ్రంగా ఉంచేందుకు టీటీడీ అధిక ప్రాధన్యత ఇస్తుంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి పుష్కరిణికి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారింది.
ALSO READ :వీళ్లు తల్లిదండ్రులేనా? ఐఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మిన్రు
టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఈ పనులు చేపట్టనుంది. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు.