ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి దర్శనాలపై పడింది. ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.దీంతో రెండు రోజుల పాటు ( 15,16 తేదీలు ) వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. తిరుమలలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది...విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని టీటీడీ అడిషనల్ ఈవో నిర్వహించారు. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జాం కాకుండా కొండ చరియలు విరిగి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అదనపు ఈవో శ్యామలరావు..
ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున నిఘా ఉంచాలని, జేసీబీలు, అంబులెన్స్ లు సిద్దంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. అలానే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశించారు
రెండు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. 2021లో భారీ వర్షాలకి రెండవ ఘాట్ రోడ్ లో భారీగా వికొండ చరియలు విరిగిపడ్డాయి.