ఎల్​ఐసీ నిర్వహణలో టీటీడీ లడ్డూ కౌంటర్లు 

హైదరాబాద్, వెలుగు : ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉన్న లడ్డూ  కౌంటర్ల నిర్వహణ ఖర్చులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యం కావాలని టీటీడీ కోరింది.  దీంతో 10 లడ్డు కౌంటర్ల నిర్వహణ ఖర్చును భరించేందుకు ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ముందుకొచ్చింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ రీజనల్ మేనేజర్  దీపా శివదాసన్  ఈ కౌంటర్ల నిర్వహణ ఖర్చును భరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం టీటీడీలో లడ్డు కౌంటర్లు ప్రారంభించారు.  కార్యక్రమంలో టీటీడీ ఏఈవో ఆర్.

శ్రీనివాసులుతో పాటు ఎల్ఐసీ, టీటీడీ అధికారులు కె. గిరిధర్, జీవీఆర్కే రవికుమార్, హెచ్. మంజునాథ్, కె. శ్రీనివాస్, ఎస్. రాజశేఖరన్, నాగేంద్ర పాల్గొన్నారు. 10 లడ్డూ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన ఎల్ఐసీకి ఏఈవోఆర్ శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు.