తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే లడ్డూలు జారీ చేసేలా దేవస్థానం నిర్ణయించింది. గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి తెచ్చింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read :- జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌పై..స్పందించిన నటి ఖుష్బూ
టిటిడి అధికారుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇకనుంచి ఆధార్ కార్డు ఉంటేనే తిరుమల శ్రీవారి లడ్డులు ఇస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. స్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితమని.. ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డే ఇస్తామని చెబుతున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై అధికారులు మండిపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు. లడ్డూల నాణ్యత పేరుతో నెయ్యి టెండర్లను టీటీడీ మార్చింది. దీంతో ప్రొడక్షన్ తగ్గడంతో లడ్డూలకు ఆధార్ లింక్ చేసినట్లు సమాచారం అందుతోంది.