
తిరుమల శ్రీవారి సుప్రభాతం, తోమలై, అర్చన, అష్టదళ పద్మ ఆరాధనతో సహా తిరుపతి దేవస్థానంలో జూన్ నెలలో వివిధ సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆన్‌లైన్ టిక్కెట్లను విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ విండోను అధికారికంగా ప్రారంభించింది.జూన్ నెలలో తిరుమల శ్రీవారిని సందర్శించాలనుకునే భక్తులు మార్చి 24 వ తేదినుంచి ఉదయం 10:00 గంటల నుండి తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. .
భక్తులు టిటిడి అధికారిక వెబ్‌సైట్ - https://ttdevasthanams.ap.gov.in ద్వారా ... ఆండ్రాయిడ్.. ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో కాని అందుబాటులో ఉన్న టీటీడీ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు ... తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనానికి రూ.200 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. టికెట్‌తో పాటు, యాత్రికులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని కూడా పొందుతారు.