
తిరుపతి: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ దేవస్థానం నిర్ణయించింది. కరోనా కేసులు.. ఆంక్షల నేపథ్యంలో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా రథసప్తమి ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
రథసప్తమి వాహనసేవల వివరాలు :
సూర్యప్రభ వాహనం: ఉదయం 6 గంటల నుంచి 8.00 వరకు(సూర్యోదయం ఉదయం 6.43 గంటలకు)
చిన్నశేష వాహనం: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
గరుడ వాహనం: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు
హనుమంత వాహనం: మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు
చక్రస్నానం: మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు (రంగనాయకుల మండపంలో)
కల్పవృక్ష వాహనం: సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు
సర్వభూపాల వాహనం: సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు
చంద్రప్రభ వాహనం: రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా రథసప్తమి
ఫిబ్రవరి 8వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి ఏకాంతంగా జరుగనుంది. ఆలయం వద్ద గల వాహనమండపంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తారు.
సూర్యప్రభ వాహనం: ఉదయం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు
హంస వాహనం: ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు
అశ్వ వాహనం: ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు
గరుడ వాహనం: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
చిన్నశేష వాహనం: ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు
స్నపనతిరుమంజనం: మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు (శ్రీకృష్ణ ముఖ మండపంలో)
చంద్రప్రభ వాహనం: సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు
గజ వాహనం: రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల వరకు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు 5,879
AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు