అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో తనిఖీ

అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో తనిఖీ

తిరుపతి నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేసి చంపిన ఘటనతో ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. అలిపిరి కాలిబాట మార్గంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన అనంతరం శనివారం రాత్రి ఏడో మైలు నుండి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు కాలినడకన వెళ్లి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

భక్తుల భద్రతా చర్యలను పరిశీలించారు. వన్యమృగాల బారి నుంచి కాపాడటానికి సెక్యూరిటీ గార్డులను పెంచడం తదితర వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈవో వెంట టీటీడీ విజిలెన్స్‌, ఇంజినీరింగ్‌, అటవీశాఖ అధికారులు ఉన్నారు.  కాగా భక్తుల భద్రత దృష్ట్యా వారిని అధికారులు గుంపులుగా పంపిస్తున్నారు.