![1983 తర్వాత తొలిసారి..](https://static.v6velugu.com/uploads/2019/03/raman_0_1_0_0.jpg)
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడిపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొన్న టీటీడిపీ.. దాదాపు పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయింది. మరోవైపు ఆ పార్టి అధినేత రెండవ సారి తన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏపీలో భారీ కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై అధినేత అంత శ్రద్ధ కనబరచకపోవడంతో ఈ సారి రాష్ట్రంలో అసలు టీడిపీ ఎంపి అభ్యర్ధి ఉండబోరనే విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేకపోవడం, ఎంపీ అభ్యర్ధిత్వంపై టీటీడిపి ఇంకా ఎటువంటి ప్రకటన చేయకపోవడం.. ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం (1983) తర్వాత మొదటి సారిగా ఎన్నికలకు దూరంగా ఉండబోతుందనే విషయం అర్ధమవుతుంది. 2014 ఎన్నికల్లో కూడా టీటీడిపీ కేవలం ఒకే ఒక్క సీటును గెలుచుకుంది.