చెప్పిన టైమ్‎కే రండి.. భక్తులకు టీటీడీ కీలక సూచన

చెప్పిన టైమ్‎కే రండి.. భక్తులకు టీటీడీ కీలక సూచన

తిరుపతి: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) బోర్డు కీలక సూచన చేసింది. దర్శన టోకెన్లు, టికెట్లలో పేర్కొన్న సమయానికే క్యూలైన్లలోకి రావాలని విజ్ఞప్తి చేసింది. నిర్దేశిత సమయానికే రావాలని గతంలో అనేకసార్లు విజ్ఞప్తి చేశాం.. కానీ కొందరు భక్తులు సమయాని కంటే ముందే వచ్చి సిబ్బందితో వాగ్వాదానానికి దిగుతున్నారని ఇది సరైన పద్దతి కాదని.. సూచించిన టైమ్‎కే రావాలని కోరారు. అలాగే.. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

ALSO READ | ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..

ఇకనైనా భక్తులు తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్లలోకి వచ్చి అధికారులకు సహకరించాలని సూచించారు. ముందుగా వచ్చి తోటి భక్తులకు ఇబ్బందులు సృష్టించొద్దని పేర్కొన్నారు. కాగా, ఇటీవల కొందరు భక్తులు దర్శన టోకెన్లు, టికెట్లలో పేర్కొన్న సమయానికే కాకుండా ముందుగా రావడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ క్రమంలో భక్తుల మధ్య గొడవలు జరగడం టీటీడీ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇటీవల వరుస విషాదాలతో వార్తల్లోకెక్కిన టీటీడీ.. ఈ సమస్య ద్వారా మరింత బద్నాం అవుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది.