
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) 75వ సినిమా మాస్ జాతర (MASS Jathara).మనదే ఇదంతా క్యాప్షన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
‘తు మేరా లవర్’అంటూ సాగే ఈ పాటలో.. ఇడియట్ లోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి' బీట్ను రీ క్రియేట్ చేశారు. ఇడియట్లో వచ్చే ఐకానిక్ స్టెప్పులను రవితేజ రీ క్రియేట్ చేస్తూ వేశారు. ఇవి మాస్ రాజా ఫ్యాన్స్కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ పూర్తి పాటను ఈనెల 14న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. మరి శ్రీలీలతో రానున్న ఈ పాట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.