తెలంగాణ వర్సిటీలో ధర్నాలు..అటు ఉద్యోగులు..ఇటు విద్యార్థులు

జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 3వ రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు.  ఇవాళ కూడా ఉద్యోగుల ధర్నా కొనసాగింది.  వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఉద్యోగులు బైఠాయించారు. ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు వంటలు చేయబోమని విధులు బహిష్కరించారు. దీంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి.. మెస్ లు ఓపెన్ చేయాలంటూ మెయిన్ గేట్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు.