పరిచయంలేని వాళ్ల మధ్య రిలేషన్ షిప్ కోసం రోజుకో డేటింగ్ యాప్ పుట్టు కొస్తోంది. డేటింగ్ సంగతి ఎలా ఉన్నా ఈ యాప్ ల వల్ల మనిషి ప్రవర్తనలో మార్పులొస్తున్నాయని. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. అయితే మనుషుల సంగతి పక్కన పెట్టి.. పశువుల కోసం ఓ డేటింగ్ యాప్ ను రూపొందిం చింది యూకేకు చెందిన ఓ సంస్థ. సెల్ మైలైవ్ స్టాక్ –గ్రేయిన్ డెక్స్ కంపెనీలు ‘టడ్డర్ ’ అనే డేటింగ్ యాప్ ను రూపొందిం చాయి.
ఈ యాప్ ద్వారా సంతానోత్పత్తి కోసం పశువులను రైతులు ఎంపిక చేసుకోవచ్చు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ యాప్ ను లాంచ్ చేశారు. టడ్డర్ యాప్ లో రేట్లు మార్కెట్ రేట్ల కన్నా తక్కువే ఉండటంతో రైతులు ఈ యాప్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఈ యాప్ లో పశువులకు అందించాల్సిన దాణా, వాటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులు అప్ డేట్ చేయొచ్చు.