అచ్చంపేట, వెలుగు: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం అచ్చంపేటలో రూ.20 కోట్ల నిధులతో నిర్మించిన 100 బెడ్ల హాస్పిటల్ ను ప్రారంభించారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వ విప్ గువ్వల బాల్‌రాజ్, ఎంపీ రాములుతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
Also Read : ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు, ప్రతి నియోజక వర్గానికి 100 బెడ్ల హాస్పిటల్, ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. బడ్జెట్లో వైద్య రంగానికి రూ. 3వేల కోట్లను కేసీఆర్ కేటాయించారన్నారు. అంతకు ముందు అచ్చంపేట మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన, మినీ స్టేడియాన్ని ప్రారంభించడంతో పాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అచ్చంపేటలో నిర్మించిన 150 డబుల్ బెడ్ రూం ఇండ్లను పారదర్శకంగా అధికారులు లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేశామన్నారు.
కలెక్టర్‌పై మంత్రి అసహనం
డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ సమయంలో అధికారులు అందుబాటులో లేక పోవడంతో కలెక్టర్ పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఉదయ్ కుమార్, టీఎస్ఎంఐడీసీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనువాస్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శాంత కుమారి, వైస్‌చైర్మెన్ బాలాజీ సింగ్, మున్సిపల్ చైర్మెన్ నర్సింహ్మ గౌడ్, మార్కెట్ చైర్ పర్సన్అరుణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పాలమూరు పచ్చ బడ్డది
-బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చ బడ్డదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. అచ్చంపేట ప్రాంతానికి మూడు ప్రాజెక్టులు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్‌ను సాధించిన ఘనత గువ్వల బాల్‌రాజ్, ఎంపీ రాములులకు దక్కిందన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ మద్ది మడుగు సమీపంలోని కృష్ణా నదిపై వంతెన నిర్మించాలని కోరారు. అనంతరం బాల్‌రాజ్ మాట్లాడుతూ నల్లమల ప్రాంత రైతుల పాదాలు కృష్ణమ్మనీల్లతో తడపడమే తన లక్ష్యమని అన్నారు
బీఆర్ఎస్ పాలనతో గ్రామాల అభివృద్ధి
అమ్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో మారు మూల గ్రామాల అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మన్ననూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కొందరు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్మన్ శాంతకుమారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.