యాదాద్రి, వెలుగు: ట్రిపుల్ఆర్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులను పట్టించుకోకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలపై రివ్యూ చేయడమేంటని బీజేపీ స్టేట్లీడర్గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. ట్రిపుల్ ఆర్ బాధితులు రెండ్రోజులుగా కలెక్టరేట్ ఎదురుగా చేస్తున్న ఆందోళనకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేస్తున్న రైతులు కన్పిస్తున్నా మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోకుండా వెళ్లిపోవడం సరికాదన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పక్కనే ఉండి చెప్పక పోవడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉండి రైతులకు నష్టం జరుగుతున్నా స్పందించక పోవడం దారుణమన్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు విషయంలో సీఎం కేసీఆర్తో లెటర్ రాయించాలని ఆయన డిమాండ్ చేశారు.