
హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీలలో అమృత్ స్కీంలో సాంక్షన్ అయి కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహా రెడ్డి అన్నారు. త్వరలో క్షేత్రస్థాయికి వచ్చి ఎమ్మెల్యేలతో కలిసి పనులను తనిఖీ చేస్తానని తెలిపారు. పనుల్లో అలసత్వం వహిస్తే మున్సిపల్ అధికా రులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరిం చారు. మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కార్యాలయంలో ఇంజినీర్లతో చైర్మన్ నరసింహా రెడ్డి రివ్యూ నిర్వహించి పనుల స్టేటస్ తెలుసుకున్నారు.
పెద్ద అంబర్‌పేట, షాద్నగ ర్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, కొత్తూరు, ఆమన్‌గల్లు, జల్పల్లి, శంషాబాద్, ఆదిభట్ల, తుర్కయాంజల్, బడంగ్ పేట కార్పొరేషన్, జిల్లెల గూడ, మీర్‌పేట, తుక్కుగూడ, తాండూరు, వికా రాబాద్, పరిగి, కొడంగల్, జవహర్‌నగర్ కార్పొరేషన్లకు అమృత్ స్కీం కింద రూ.409 కోట్లు సాంక్షన్ అయ్యాయని ఆయన గుర్తుచేశారు. మరికొన్ని మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు సాంక్షన్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కార్పొరేషన్ ద్వారా ఇటీవల రూ.500 కోట్లు సాంక్షన్ చేసిందన్నారు. కాగా.. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా ఉన్న వరంగల్, కరీంనగర్ తోపాటు మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు చోటు కల్పించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి వినతిపత్రం ఇచ్చామని నరసింహా రెడ్డి తెలిపారు.