
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి లీడ్ రోల్స్‌లో సుప్రీత్ సి కృష్ణ రూపొందించిన చిత్రం ‘టుక్ టుక్’. రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డి నిర్మించారు. మార్చి 21న సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరోయిన్ శాన్వీ మేఘన మాట్లాడుతూ ‘రీసెంట్‌గా ‘కుడుంబస్తాన్’ అనే తమిళ సినిమా చేశా. ఆ సినిమాకు అక్కడ చాలా మంచి స్పందన వస్తోంది. ఓటీటీలో విడుదలైన తెలుగు వెర్షన్‌ను కూడా మనవాళ్లు ఆదరించారు.
ఇప్పుడు ‘టుక్ టుక్’ చిత్రాన్ని కూడా అందరూ సపోర్ట్ చేసి, ఈ తెలుగమ్మాయిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పింది. ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉందని, చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నిహాల్ అన్నాడు. ఈ చిత్రం ఓ కమర్షియల్ ప్యాకేజ్‌లా ఉంటుందని దర్శకుడు సుప్రీత్ అన్నాడు. ఫాంటసీ థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని నిర్మాతల్లో ఒకరైన రాహుల్ రెడ్డి చెప్పారు.