యువతకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం.. మహిళల అకౌంట్ లో రూ.లక్ష : రాహుల్ గాంధీ

యువతకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం.. మహిళల అకౌంట్ లో రూ.లక్ష : రాహుల్ గాంధీ

 కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ సిటీ శివార్లలోని తుక్కుగూడలోని భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశాలను వివరించారు.

  • ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు.. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ఆశలు
  • మ్యానిఫెస్టోలోని 5 హామీలు.. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు
  • దేశంలోని నిరుద్యోగులు అందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నాం..
  • నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కింద శిక్షణ ఇస్తాం.
  • గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తున్నామో.. దేశంలోని యువత అందరికీ ఏడాది పాటు అప్రంటీస్ ఇవ్వబోతున్నాం.
  • దేశంలోని నిరుద్యోగ యువత అందరికీ లక్ష రూపాయల జీతంతో ఏడాదిపాటు అప్రంటీస్ శిక్షణ. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఈ శిక్షణ ఇప్పించటం జరుగుతుంది.
  • యువతకు సంబంధించి ప్రతి విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం.. దేశ భవిష్యత్ కు ఇస్తు్న్న హామీ
  • మహిళలు కూలీ పనులు, ఆఫీసుల్లో ఉద్యోగంతోపాటు ఇంటి పనులతో కోట్ల మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబాలు పేదరికంలోకి వెళ్లాయి.
  • నారీ న్యాయ్ నినాదంతో ముందుకొస్తున్నాం..
  • నారీ న్యాయ్ కింద ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు.. సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాం.. బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తాం.. ఇది విప్లవాత్మకమైన నిర్ణయం.. దేశ ముఖ చిత్రం మారబోతుంది.
  • నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఇవ్వబోతున్నది.. 
  • దేశంలోని ఏ కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు తక్కువ కాకుండా ఉంటుంది.
  • కార్మికులకు   కనీస వేతన విధానాన్ని అమలు చేస్తాం. రోజుకు 400 రూపాయిలు కల్పిస్తాం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అభివృద్ది చేస్తాం