గోదావరిఖని ఏసీపీగా శ్రీనివాసరావు

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖని ఏసీపీగా తుల శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఏసీపీకి  సీఐలు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీపీ రెమా రాజేశ్వరిని ఏసీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. గోదావరిఖని ట్రాఫిక్‌‌ సీఐగా టి.ప్రవీణ్‌‌ కుమార్‌‌, ఆర్టీసీ డీఎం గా నాగభూషణం నియమితులయ్యారు.

కోరుట్ల ఆర్డీవోగా రాజేశ్వర్​ 

కోరుట్ల: కోరుట్ల ఆర్డీవోగా రాజేశ్వర్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్ధార్​ రాజేశ్‌ ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.

ముగ్గురు సీఐల బదిలీ

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌‌రెడ్డి  గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 
సిరిసిల్ల టౌన్ సీఐగా పని చేసిన అనిల్ కుమార్ ను సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్‌కు, సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్​టౌన్ సీఐగా బదిలీ అయ్యారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్‌కు శశిధర్ రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐగా వర్ధన్నపేట నుంచి సదన్ కుమార్ బదిలీపై రానున్నారు.