వేములవాడ, వెలుగు : స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వేములవాడలో దొరలే రాజ్యం ఏలుతున్నారని, ఈసారైనా బలహీనవర్గాలకు చెందిన మహిళగా తనను గెలిపించాలని వేములవాడ బీజేపీ అభ్యర్థి తుల ఉమ కోరారు.
బుధవారం వేములవాడలోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వేములవాడలో దొరల గడీలను బద్దలు కొడుతానన్నారు. ఆమె వెంట లీడర్లు అన్నారం శ్రీనివాస్, అన్నపూర్ణ, దేవ్ యాదవ్ ఉన్నారు.