
హిందువుల ఇళ్లలో తులసి కచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కకు నీళ్లు పోసి పూజిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువులు నమ్ముతుంటారు. అయితే ఇంట్లో తులసి మొక్కను ఏరోజు నాటాలి.. నాటేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. . .!
తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని.. ఆ మొక్కకు రోజూ పూజిస్తే ఐశ్వర్యం వృద్ది చెందుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తారు. తులసి మొక్కను పూజించడం వలన కష్టాలు తొలగిపోతాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు నాటకూడదనని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
హిందూ పురాణాల ప్రకారం తులసిమొక్కను గురువారం.. శుక్రవారం నాటాలి. ఈ రెండు రోజుల్లో నాటడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. ఇంట్లో శాంతి వాతావరణం నెలకొని ఐశ్వర్యం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు శుభ ఫలితాలే ఉంటాయి.
Also Read : ఎండలకు మొఖం మాడిపోయిందా..?
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఉత్తరదిక్కులో నాటాలి. ఉత్తరదిశలో కుబేరుడు ఉంటాడని.. కుబేరుడు ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడని పెద్దులు చెబుతుంటారు. ఇక తులసి మొక్కను తూర్పు దిశలో నాటవచ్చు. తూర్పుదిశలో ఉండటం వలన సంపద పెరుగుంది. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారమవుతాయి.
తులసి మొక్కను నిత్యం .. గంధం... పసుపు... కుంకుమ.. పుష్పాలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. తులసి పూజకు అక్షింతలు ఉపయోగించకూడదు. తులసి మొక్కకు పూజ చేసిన తరువాత మొక్క సైజును బట్టి సరిపడ నీళ్లు పోయాలి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా స్థలం ఉంటే తప్పని సరిగా ప్రదక్షిణాలు చేయాలి. లేదంటే తులసి మొక్క ఎదురుగా ఆత్మప్రదక్షిణలు చేయాలి. తులసి మొక్క చుట్టూ మురికిఉండకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ దేవి ఈ మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు.
తులసి మొక్కకు నీళ్లను సూర్యోదయ సమయంలో సమర్పిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. తులసి పూజ సమయంలో నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు. పసుపురంగు..ఎర్రని బట్టలు ధరించాలి.
తులసి మొక్కకు ఆదివారం.. ఏకాదశి పుణ్య తిథి రోజున నీళ్లు పోయకూడదు. ఎందుకంటే ఆరెండు రోజులు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అంతేకాదు ఆ రోజుల్లో తులసి ఆకులను కూడా కోయకూడదు. ఏకాదశి రోజు తులసి దళాలతో పూజ చేయాలి కాబట్టి.. ముందు రోజే కోసుకొని భద్రపరచుకోవాలి. వీటికి విరుద్దంగా ప్రవర్తిస్తే.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి.. అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.