
పారిస్ ఒలింపిక్స్‌లో జూడో ప్లేయన్‌ర్ తులికా మఇండియా ఏ నిరాశపర్చింది. శుక్రవారం జరిగిన విమెన్స్ +78 కేజీల తొలి రౌండ్‌లోనే తులికా 0–10 (ఇప్పాన్) తేడాతో లండన్ గేమ్స్ చాంపియన్ ఇడాలిస్ ఒర్టిజ్ (క్యూబా) చేతిలో ఓడింది. నాలుగుసార్లు ఒలింపిక్ మెడల్స్ నెగ్గిన ఒర్టిజ్ కేవలం 28 సెకన్లలోనే తులికాను చిత్తు చేసింది. బౌట్ ఆరంభంలోనే తులికాను మ్యాట్‌పై పడేసి కదలకుండా చేసింది. దాదాపు 20 సెకన్ల పాటు అదిమిపట్టడంతో గెలుపు ఏకపక్షమైంది.
అథ్లెటిక్స్‌లో నిరాశే..
అథ్లెటిక్స్ ఈవెంట్లను ఇండియా ప్రతికూల పలితాలతో ఆరంభించింది. విమెన్స్ 5 వేల మీ. హీట్–1లో అంకిత దయాని 16:19.38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 20వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. భారీ అంచనాలున్న పారుల్ చౌదరి రెండో హీట్‌లో 15:10.68 సెకన్ల టైమింగ్‌తో 14వ ప్లేస్‌లో నిలిచింది. ప్రతి హీట్స్‌లో టాప్–8లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ఇక, రోయింగ్‌లో ఇది వరకే ఫైనల్ కు దూరమైన బాల్ రాజ్ పన్వర్ మెన్స్ సింగిల్ స్కల్ విభాగంలో 7:02.37 సెకన్ల టైమింగ్‌తో 23వ ప్లేస్‌లో నిలిచాడు.