శ్రీ సాయి న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని బాలాజీ నగర్ లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శ్రీ సాయి న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్​చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్​మెంట్ మోదుగు వీరభద్రం, డాక్టర్ ఎ. హర్షవర్ధన్, ఈఎన్టీ సర్జన్ సామాల అమర్ నాథ్, ఐఎంఏ ప్రెసిడెంట్ కంభంపాటి నారాయణ రావు, ఐఎంఏ జనరల్ సెక్రటరీ కే.జగదీశ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి, డివిజన్ కార్పొరేటర్ క్లైమెంట్ తదితరులు పాల్గొన్నారు.