ఖమ్మం టౌన్, వెలుగు : తెలుగు రాష్ట్రాల్లో అవినీతి, నిర్భందం, ఆక్రమ, బెదిరింపుల పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మంలో ఆరాచక పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. సుస్థిర పాలన సాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.