- ఇరిగేషన్ ఆఫీసర్లపై మంత్రి తుమ్మల, పొంగులేటి ఫైర్
- పాలేరు ఎడమ కాల్వ యూటీ పనులను వేర్వేరుగా పరిశీలించిన మంత్రులు
కూసుమంచి, వెలుగు : పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తుమ్మల, రాత్రి మంత్రి పొంగులేటి ఆకస్మికంగా అండర్ టన్నెల్ (యూటీ) పనులను పరిశీలించారు. 20 రోజుల పాటు పనులు సాగదీయడం ఏంటని, సకాలంలో నీటిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మంత్రి తుమ్మల ఇరిగేషన్ సీఈ విద్యాసాగర్‌ను ప్రశ్నించారు. రైతుల పంటలు ఎండినాకా నీళ్లులు ఇస్తారా? అంటూ ఫేర్ అయ్యారు.
నీటి విడుదలలో జాప్యం చేసిన ఆఫీసర్లపై రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ ముజామ్మిల్ఖాన్కు ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి మంగళవారం పంటలకు నీళ్లు అందించాలన్నారు. పనులు చేసే ప్రాంతంలో లైటింగ్ సరిపడేంత లేకపోవడం గమనించిన లైట్లు ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి చెప్పారు. పనులు ఆశించిన మేరకు పురోగతిలో లేకపోవడంతో ఆయన ఎస్ఈ నర్సింగరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ విద్యాసాగర్, ఎస్ఈ నర్సింగరావు,ఈఈలు మంగళపూడి వెంకటేశ్వర్లు, అనన్యా, డీఈ రమేశ్‌రెడ్డి, మధు పాల్గొన్నారు.
విలీన గ్రామాల అభివృద్ధికి చర్యలు
ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని విలీన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ అల్లీపురంలో రూ. 35 లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తున్నట్టు తెలిపారు.
దేవరపల్లి, రాజమండ్రి, అమరావతి, విజయవాడ జాతీయ రోడ్లు త్వరలో వస్తాయని, వీటి ద్వారా ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, సహాయ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు
నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో ఛాంబర్ లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కమిషనర్ అభిషేక్ అగస్త్యతో సోమవారం మీటింగ్ నిర్వహించారు.