ఇలాంటి బెదిరింపులకు నా కార్యకర్త కూడా భయపడడు : తుమ్మల నాగేశ్వరరావు

మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఈసీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీ, అర్బన్ లోని గొల్లగూడెంలో ఉన్న తుమ్మల  ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి.  పలు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.  

మంత్రి పువ్వాడకు ఓటమి ఖారారైందిన్నారు తుమ్మల నాగేశ్వరరావు.  కక్ష్యపూరితంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  సీఎం కేసీఆర్ లాంటోడే తన  ముందు బచ్చా .. ఇక మంత్రి అజయ్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు.  

మంత్రి అజయ్ తన డిపాజిట్ కోసం మాత్రమే ప్రయత్నం చేసుకోవాలని సూచించారు.  ఇలాంటి ప్రయత్నాలతో తుమ్మల కాదు కదా తుమ్మలతో ఉన్న కార్యకర్త కూడా బెదరడని చెప్పారు.  మంత్రి పువ్వాడ వచ్చాకా ఖమ్మంలో ప్రజాస్వామ్యం అంటే మరిచిపోయాడన్నారు.