పనికిరాని పాలేరును వజ్రం లాగా తయారు చేశా : తుమ్మల నాగేశ్వరరావు

గతంలో పనికిరాని పాలేరును  ఈరోజు వజ్రం లాగా తాను తయారు చేశానని కాంగ్రెస్  నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  ఖమ్మం రూరల్ తల్లంపాడులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  పాలేరు శాశ్వతంగా పచ్చగా ఉండాలంటే గోదావరి జలాలను తీసుకురావాలని, వాటిని తాను తీసుకువస్తానని చెప్పారు.  

మీ ఆశీర్వాదంతో మిగిలిన అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు.  మీరు ఎవరినీ అడగకుండా మీరే పదిమందికి సాయం చేసేలాగా తయారు చేస్తానని తెలిపారు. ఈదేశంలో ఖమ్మం జిల్లా ప్రతిష్టని నిలిపే బాధ్యతను  తాను తీసుకుంటానన్నారు.  గత ఎన్నికల్లో పొరపాటు చేశామని, ఈ ఎన్నికల్లో మీరు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని తుమ్మల చెప్పారు.