పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు.. పూజకు పనికి రాని పువ్వు : తుమ్మల

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు ఖమ్మం కాంగ్రెస్​అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. మంత్రి పువ్వాడ నాలుగు పార్టీలు మారాడని అన్నారు. అజయ్ నువ్వెంత నీ కథ ఎంత ..?  అని సవాల్ విసిరారు. తన తండ్రిని అజయ్ అప్రతిష్ట పాల్జేశాడని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయే దాకా తెలుగుదేశాన్ని కాపాడే ప్రయత్నం చేశానని, తాను గెలిస్తే మంత్రి పదవి రాదని డబ్బులు ఇచ్చి తనను ఓడించలేదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ మూడు నెలలు బతిమిలాడితేనే తాను బీఆర్ఎస్ లోకి వెళ్లానని చెప్పారు. 

పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు.. పూజకు పనికి రాని పువ్వు పువ్వాడ అని విమర్శలు చేశారు. తుమ్మ చెట్టు ముదిరితే నీళ్లు లేకుండా బతికి అరక మాదిరిగా, రైతుకు అన్నం పెట్టడానికి తుమ్మ పనికి వస్తుందన్నారు. పువ్వాడ అజయ్ కు మెడకాయ మీద తలకాయ లేదు కాబట్టే బస్ డిపో రోడ్డులో సెంట్రల్ లైటింగ్ వేశాడని చెప్పారు. గోళ్లపాడు ఛానల్ లో మంత్రి పువ్వాడ అజయ్ నిధులు కాజేశారని ఆరోపించారు. తాను హైవేలపై లైట్లు పెట్టిస్తే...  అజయ్ మాత్రం కమీషన్ల కోసం డొంకల్లో లైట్లు వేయించారని ఆరోపించారు.

బీఆర్ఎస్ కు దిక్కులేని సమయంలో తాను జెండా కట్టి జిల్లాను అప్పజెప్పనన్నారు. ఆరు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తానే తీసుకొచ్చానన్నారు. ఆరేళ్లైనా పువ్వాడ ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు. కాంట్రాక్టులను బెదిరించిన సంస్కృతి పువ్వాడదన్నారు. ఆంధ్రా, తెలంగాణలో కట్టిన ప్రతి ప్రాజెక్టులో తన భాగస్వామ్యం ఉందని చెప్పారు. కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది తానేనని, కావాలంటే చంద్రబాబుని అడగవచ్చు అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిసారి అబద్దాలు మాట్లాడుతారని, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ALSO READ : బసవేశ్వర ప్రాజెక్టు దగ్గర డాన్సులు చేయండి: గిరిజ శెట్కార్ 

ఖమ్మం బీఆర్ఎస్​ఎంపీ నామా నాగేశ్వరరావు పేరుకే ఎంపీ అని, ఆయన్ను ఒక్క కార్యక్రమానికి కూడా పిలవడం లేదు.. గౌరవించడం లేదన్నారు. నవంబర్ 30వ తేదీన పువ్వాడను 14 అడుగుల గోతిలో పాతి పెడుతారని చెప్పారు. ఈసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే డివిజన్లలో తిరగనివ్వనని హెచ్చరించారు. తనను ఓడించాలని మంత్రి కేటీఆర్ ఆదేశిస్తే.. పువ్వాడ అజయ్ కుమార్ పాటించారని, తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గుండు సున్న ఉన్న బీఆర్ఎస్ పార్టీని తాను ఒక స్థాయికి తీసుకొచ్చానని చెప్పారు.